ఈ మధ్యకాలంలో దీర్ఘకాలిక సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ సమస్య వయసుతో సంబంధం లేకుండా వస్తోంది. అయితే చిన్న వయసులో గుండెకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అనే చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవన విధానం మారిపోయింది. రోజువారి ఆహారంలో ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం లేదు. దీనివలన చాలా దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎన్నో కారణాల వలన యువతలో ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతుందో కార్టిసాల్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. దీంతో బీపి ఎక్కువ అవుతుంది. ఈ విధంగా గుండె ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఎలాంటి విషయం గురించి అయినా ఎక్కువ ఒత్తిడి తీసుకోకూడదు.
సమయం లేకపోవడం వలన చాలా శాతం మంది ప్రాసెస్ చేసినటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటితోపాటు అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు మరియు పంచదారను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ విధంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. దీంతో గుండెపోటు వంటి సమస్యలు ఎక్కువవుతాయి. అంతేకాకుండా మంచి ఆహారాన్ని తీసుకోకపోవడం వలన మరియు ఎలాంటి వ్యాయామాలు చేయకపోవడం వలన బరువు కూడా పెరుగుతారు. దీంతో శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగదు. ఈ విధంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి.
అదేవిధంగా గుండెపోటు రావడానికి స్మోకింగ్ మరియు మద్యం సేవించడం కూడా ముఖ్యమైన కారణాలు అనే చెప్పవచ్చు. వీటి వలన గుండె ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. దీంతో గుండెకు సమస్యకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ అవుతాయి. ఊబకాయం సమస్య ఎక్కువ అవ్వడం వలన డయాబెటిస్, హై బీపీ, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ విధంగా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక జీవనవిధానాన్ని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.