ఎప్పుడు వర్షం పడుతుంది.. ? ఎప్పుడు ఎండ కొడుతుంది..? ఎప్పుడు చలి పెడుతుంది..? అనే విషయాలను వాతావరణ శాఖ అంచనా వేసి చెబితేనే మనకు తెలుస్తుంది. అయితే కొన్నిసార్లు అంచనాలు వాతావరణంలోని మార్పుల వల్ల తారుమారు అవ్వచ్చు. దాంతో పంటలకు నష్టం జరగవచ్చు. అలాగే తాను నష్టపోయానని ఎంతో మంది రైతులు నష్టపోయారని ఓ రైతు సంఘం నాయకుడు కోర్టును ఆశ్రయిస్తానని చెబుతున్నాడు.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లో మాల్వా ప్రాంతంలో ఐఎండీ తప్పుడు అంచనాల కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని రైతులను వాతావరణ శాఖ తప్పుదోవ పట్టించిందని భరత్ సింగ్ అనే రైతు సంఘం నాయకుడు ఆరోపిస్తున్నారు. దీనిపై తాను కోర్టుకు వెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పారు. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఇక ఒకవేళ భరత్ సింగ్ కోర్టుకు వెళ్తే ఎలాంటి తీర్పు వస్తుందోనని రైతులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.