కలుపుమందుల వాడకం పై రైతులు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి..

-

కలుపు మొక్కలు పంటలో ఎక్కువగా రావడం చూస్తూనే ఉంటాము..అయితే పంట మొక్కలకు వేసే ఎరువులు మొదలగునవి తీసుకొని ఏపుగా పెరుగుతాయి.. తద్వారా పంట మొక్కలు బలహీనంగా మారుతాయి.దాంతో పంటకు నష్టం రావడం జరుగుతుంది.ఉద్యానవన పంటలలో కలుపు మొక్కల నివారణ అనేది పంట ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషించును. కలుపు వల్ల అధిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

కలుపు మందుల వాడకంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

*. స్ప్రేయర్ల నుండి మందు సమంగా వచ్చేటట్లు పిచికారి చేయాలి..

*. ఎండ మరీ ఎక్కువగా ఉన్నపుడు అలాగే గాలి ఎక్కువగా వీస్తున్నపుడు గాలికి ఎదురుగా కలుపు మందులు పిచికారీ చేయరాదు.

*. కేవలం ఉదయం లేదా సాయంత్రం సమయంలో మాత్రమే మందును పిచికారి చెయ్యాలి.

*. కలుపు మందులు పురుగు మందుల వలె విషపూరితాలు కనుక వీటిని ఆహార పదార్థాలకు, పిల్లలను దూరంగా ఉంచాలి.

*. మామూలు స్ప్రేయర్ తో కలుపు మందులు స్ప్రే చెయ్యాలి.

*. కనీసం 6 గంటలైనా వర్షం రాకుండా వున్న సమయంలోనే కలుపు మందులు చల్లాలి.

కలుపు కొట్టేటప్పుడు వీటిని గుర్తుంచుకోవాలి..

*. మందును పిచికారి చేసే సమయంలో సురక్షితమైన వస్త్రాలను వాడాలి..

*. నోటితో నాజిల్ను శుభ్రం చేయటం ప్రమాదకరము.

*. చల్లేటప్పుడు పొగ త్రాగరాదు.

*.చల్లిన తరువాత కాళ్లు, చేతులు, ముఖము శుభ్రంగా కడుగుకొన్న తరువాతనే తినటం, మంచినీరు తాగటం మొదలయిన పనులు చేయాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version