తెలుగు బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ మధ్యే తనకు ఓ సర్జరీ జరిగినట్లు రష్మీ తాజాగా వెల్లడించింది. అసలు తనకు ఏం జరిగింది? ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టింది. ఈ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలిపింది.
‘‘ఈ కష్టకాలంలో నాకు అండగా నిలిచిన అందరికి థాంక్యూ. ఐదు రోజుల్లోనే నా బాడీలో హిమోగ్లోబిన్ శఆతం 9కి పడిపోయింది. ఏం జరుగుతుందో అర్థం అయ్యే లోగానే మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. జనవరి నుంచి నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అకాల రక్తస్రావం, తీవ్రమైన భుజం నొప్పితో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మార్చి 29 నాటికి బాగా నీరసించడంతో ఆస్పత్రికి వెళ్లాను. వర్క్ కమిట్మెంట్స్ పూర్తి చేసుకుని ఆస్పత్రిలో చేరాను. ఏప్రిల్ 18న సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను.. మరో మూడు వారాలు రెస్ట్ తీసుకుంటాను’’ అని రష్మీ రాసుకొచ్చింది.
View this post on Instagram