గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. లిఫ్ట్ కూలడంతో పలువురికి గాయాలయ్యాయి. ఆసీఫ్ నగర్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో ఐదోవఅంతస్తు నుంచి ఒక్కసారిగా మొదటి అంతస్తులోకి లిఫ్ట్ పడిపోయింది.
ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ముగ్గురు పెద్దలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పెద్దలకు తీవ్ర గాయాలు, పిల్లలకు స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది.బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించిన నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్.. వారికి చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కాగా, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
కూలిన లిఫ్ట్.. ముగ్గురికి గాయాలు..
హైదరాబాద్ ఆసీఫ్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఘటన
ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా మొదటి అంతస్తులోకి పడిపోయిన లిఫ్ట్
ప్రమాద సమయంలో లిఫ్ట్ లో ముగ్గురు పెద్దలు, ముగ్గురు చిన్నారులు
పెద్దలకు తీవ్ర గాయాలు, పిల్లలకు స్వల్ప గాయాలు
బాధితులను ఆసుపత్రికి… pic.twitter.com/lPPpGilsLf
— BIG TV Breaking News (@bigtvtelugu) April 7, 2025