సరైన జీవన శైలి ఉండడం వలన ఎంతో ఆరోగ్యంగా జీవించవచ్చు. ప్రతిరోజు పోషక విలువలు ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటుగా వ్యాయామాలను కూడా చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తారో ఎంతో ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే చాలా శాతం మంది సమయం లేదని వ్యాయామాలను చేయకుండా ఉంటారు. అలా కాకుండా ఎంతో చిన్నచిన్న అలవాట్లను చేసుకోవడం వలన క్యాలరీలను ఖర్చు చేయవచ్చు.
పైగా ఇటువంటి చిన్న చిన్న వ్యాయామాలకు ఎలాంటి జిం ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు. క్యాలరీలను కరిగించాలని అనుకుంటే తప్పకుండా మెట్లను ఎక్కుతూ ఉండాలి. ముఖ్యంగా లిఫ్ట్ వినియోగాన్ని తగ్గించి ఎక్కువ సార్లు నడవడం వలన క్యాలరీలు ఖర్చు అవుతాయి. దీంతో ఎంతో ఫిట్ గా ఉండవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో పెంపుడు కుక్క ఉన్నట్లయితే దాన్ని వాకింగ్ కు తీసుకుని వెళ్లడం వంటివి చెయ్యాలి. ఇలా చేయడం వలన కొంతసేపు మీరు కూడా నడుస్తారు. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. ఈ విధంగా బరువుని నియంత్రించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా శాతం మంది కంప్యూటర్ ల ముందు ఎక్కువ సమయం పనిచేస్తున్నారు. అలాంటప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక కూర్చున్న సమయంలోనే పాదాలను, కాళ్ళను కదిలించుతూ ఉండాలి.
చేతులు మరియు వేళ్ళకు సంబంధించిన వ్యాయామాలను చేయడం వలన శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్న అలవాట్లు ఫిట్నెస్ ను పెంచుతాయి. పైగా ఎక్కువ సమయం కూర్చోకుండా నిల్చుని పనిచేయడం కూడా అలవాటు చేసుకోండి. ఖాళీ సమయం దొరికినప్పుడు గార్డెనింగ్, వంట పనుల్లో సహాయం చేయడం, ఇంటిని శుభ్రం చేయడం వంటివి కూడా చేయవచ్చు. ఇలా చేయడం వలన మీ పనులు పూర్తవుతాయి. పైగా ఎంతో ఫిట్ గా కూడా ఉండవచ్చు. వ్యాయామాలు చేయడం ఇష్టం లేనప్పుడు డాన్స్ కూడా ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పవచ్చు. కనుక సమయం దొరికినప్పుడు మ్యూజిక్ పెట్టుకుని కొద్దిసేపు డాన్స్ చెయ్యండి.