సౌది అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది భారత పౌరులు దుర్మరణం పాలయ్యారు. సౌది అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. జెడ్డా లోని భారత రాయభార కార్యాలయం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని.. స్తానిక అధికారులతో బాధిత కుటుంబాలతో తాము ఘటనపై ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని ప్రకటనలో పేర్కొంది.
ప్రమాదం పై బాధిత కుటుంబాలు సమాచారం తెలుసుకోవడం కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేసింది. సమాచారం కోసం 8002440003, 0122614093,0126614276, 0556122301 నెంబర్లలో సంప్రదించాలని సూచించింది. ప్రమాదం పై భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ స్పందించారు. జెడాలోని రాయబార కార్యాలయంలో తాను మాట్లాడానని.. ప్రమాదం గురించి సమాచారం అడిగి తెలుసుకున్నానని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు.