రాష్ట్రంలో రోడ్డు ప్రమాదల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రహదారులపై ట్రాఫిక్ విపరీతరంగా పెరుగుతున్నా కొందరు ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలను హరిస్తున్నారు. తాజాగా ఓ ఆర్టీసీ బస్సును వెనుకనుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. బస్సు రివర్స్ తీస్తుండగా వేగంగా వచ్చిన లారీ కంట్రోల్ తప్పి ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిసింది. అనంతరం లారీ డ్రైవర్ మీద పోలీసులు కేసు పెట్టి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.