ఏపీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా జగన్-అదానీ మధ్య ఒప్పందం జరిగిందని….అదానీ కంపెనీతో జగన్ ప్రభుత్వ సోలార్ పవర్ కొనుగోళ్ల ఒప్పందాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల కీలక కామెంట్లు చేశారు. జగన్ విషయంలో ఈ ఒప్పందం రెండో అతిపెద్ద క్విడ్ ప్రో కో అంటూ యనమల ఫైర్ అయ్యారు. జగన్ క్విడ్ ప్రో కో వ్యవహరంలో విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరిన యనమల… జగన్ అవినీతి అక్రమాల చిట్టాలో అదానీతో సోలార్ పవర్ ఒప్పందాలు రెండొ పెద్ద క్విడ్ ప్రో కో అన్నారు.
జగన్ క్విడ్ ప్రో కో వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని.. జగన్ అవినీతి వల్ల ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం పడుతుందని తెలిపారు. జగన్ క్విడ్ ప్రో కో విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వమైనా ఏసీబీ విచారణకు ఆదేశించాలని.. తమ ప్రభుత్వం హయాంలో సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై సెకీతోనే తప్ప.. అదానీతో ఒప్పందాలే చేసుకోలేదని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. సెకీ అనేది కేవలం నోడల్ ఏజెన్సీ మాత్రమేనని… సెకీకి అదానీ కేసుతో ఎంత మాత్రమూ సంబంధం లేదన్నారు. అదానీ-జగన్ డీల్ జరిగిందని స్పష్టంగా కన్పిస్తోందని… ఏపీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా జగన్-అదానీ మధ్య ఒప్పందం జరిగిందని ఆరోపణలు చేశారు.