శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది దుర్మరణం

-

శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆ దేశంలోని సెంట్రల్ ప్రావిన్స్‌ కోట్మలేలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు కొండ మీద నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. అంతేకాకుండా మరో 25 మందికి గాయాలు అయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 25 మంది క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తొలుత 8 మంది చనిపోగా.. ఆస్పత్రిలో మరో ముగ్గురు తుదిశ్వాస విడిచారు. మృతుల్లో ఐదుగురు పురుషులు ఉండగా.. ఆరుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం.కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Read more RELATED
Recommended to you

Latest news