ఇండియా, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు పాక్ బోర్డర్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే మరోవైపు అమెరికా అండదండలతో కాల్పుల విరమణ పేరిట తన వక్రబుద్దిని ప్రదర్శిస్తోంది.నిన్న మధ్యాహ్నం శాంతి చర్చలకు ఒకే అని చెప్పి.. చీకటి పడగానే డ్రోన్లతో మరోసారి సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది.

ఈ క్రమంలోనే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి విజయం మాదే అని ప్రకటించారు. భారతదేశంతో యుద్ధంలో తమదే విజయమని పాక్ ప్రధాని ప్రకటించడంతో ఆ దేశ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. తమ జాతీయ జెండాలను పట్టుకుని వాహనాల్లో రోడ్లపై ర్యాలీ నిర్వహించారు.పెషావర్లో పాక్ పౌరులు సెలబ్రేషన్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.