కూతురు బర్త్‌ డే స్పెషల్.. 4 క్వింటాళ్ల టమాట పంచిపెట్టిన తండ్రి

-

ఒకప్పుడు బంగారం, నగదు, ఇళ్లు, స్థలాలు ఉంటే ధనవంతులు అనే వాళ్లు. కానీ ప్రస్తుతం ఇంట్లో ఎవరైనా టమాట కూర వండితే.. మీరు బాగా రిచ్​ అంటున్నారు. అలా ఓ రిచ్ డాడీ తన కూతురు పుట్టిన రోజు ఘనంగా చేయాలనుకున్నాడు. సాధారణంగా గ్రాండ్​గా అంటే.. డెకరేషన్, ఇన్విటేషన్లు, పెద్దగా పార్టీ చేయడం వంటివి చేస్తుంటారు. కానీ ఈ తండ్రి మాత్రం తన కూతురు పుట్టిన రోజున ఏకంగా 4 క్వింటాళ్ల టమాట పంపిణీ చేశాడు.

హైదరాబాద్‌ పంజాగుట్ట ప్రతాప్‌నగర్‌కు చెందిన టీఎమ్మార్పీఎస్‌ యువసేన అధ్యక్షుడు నల్ల శివ తన కుమార్తె పుట్టిన రోజున టమాటలు పంచిపెట్టాడు. ఏకంగా 4 క్వింటాళ్ల వరకు టమాటలను పంపిణీ చేసి ఔరా అనిపించాడు. టమాట ధరలు ఆకాశాన్నంటిన తరుణంలో బిడ్డ పుట్టిన రోజు సందర్భంగా పెద్ద మొత్తంలో టమాటాలను ఉచితంగా పంపిణీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇక గత కొన్ని రోజులుగా మార్కెట్​లో టమాటల ధర రూ.150 నుంచి రూ.300 వరకు పలుకుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version