ఈషా షౌండేషన్‌లో సమంత.. ఫొటోలు వైరల్

-

ఇటీవలే ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత.. మరికొద్ది రోజుల్లో చికిత్స కోసం అమెరికాకు వెళ్లనుంది. అయితే యూఎస్​కు వెళ్లే ముందు సామ్ ఆధ్యాత్మిక పర్యటన చేస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోని పలు ప్రముఖ ఆలయాలను సందర్శిస్తోంది. తాజాగా సమంత కోయంబత్తూరులోని ఈషా షౌండేషన్‌కు వెళ్లింది. ఆ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆధర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ధ్యానం చేసింది. ఈ ఫొటోలు కాస్త ఇప్పుడు నెట్టింట షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.

‘‘ఇప్పటి వరకు.. ఎలాంటి ఆలోచనలు రాకుండా, ఎటూ కదలకుండా కూర్చోవడం అసాధ్యమనిపించింది. కానీ, ధ్యానమనేది ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తిమంతమైన మార్గం అని ఈరోజు అర్థమైంది. ఈ ప్రక్రియ సింపుల్‌గా ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఊహించలేదు’’ అని సమంత ఆ ఫొటోలకు క్యాప్షన్ జోడించింది. సమంత షేర్‌ చేసిన ఫొటోల్లో ఆమె అందరితో కలిసి కూర్చొని, సింపుల్‌గా కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version