వచ్చే ఎన్నికలే లక్ష్యంగా 26 విపక్షాల పార్టీలు INDIA (ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్) పేరుతో ఏర్పాటు చేసుకున్న కూటమికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ చిహ్నాల చట్టం ప్రకారం INDIA పేరును వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోరాదని, ఇది అక్రమమని ఢిల్లీ బారఖమ్బ పోలీస్ స్టేషన్లో అవినాష్ మిశ్రా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.
కాగా, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తన ట్విటర్ బయోలో INDIA అని తొలగించి, BHARAT అని యాడ్ చేశారు. ప్రతిపక్ష కూటమి INDIA అని పేరు పెట్టిన తర్వాత శర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘బ్రిటీషర్లు మన దేశానికి ఇండియా అని పేరు పెట్టారు. బ్రిటిష్ వారసత్వం నుంచి విముక్తి పొందాలి. పూర్వీకులు భారత్ కోసం పని చేశారు. మనం కూడా భారత్ కోసం వర్క్ చేయాలి’ అని పిలుపునిచ్చారు.