తెలంగాణ‌లో పెట్టుబ‌డి ప్రక‌టించిన ఫాక్స్ కాన్ సంస్థ

-

ఫాక్స్ కాన్ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఫలితంగా హోన్ హై ఫాక్స్ కాన్ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. ఈ మేర‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తో ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యంగ్ లియూభేటీ అయి ఈ విషయాన్ని ప్ర‌క‌టించారు. ఈ పెట్టుబ‌డుల ద్వారా రాష్ట్రంలో ల‌క్ష మందికి ఉపాధి క‌ల్పిస్తామ‌ని ఫాక్స్ కాన్ ప్ర‌క‌టించింది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదమైన విషయమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ అని సీఎం కేసీఆర్ అన్నారు. అలాంటి గొప్ప సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఉత్పత్తి కార్యకలాపాలకు తెలంగాణ రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోవడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఫాక్స్ కాన్ సంస్థ భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై కూలంకషంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఫాక్స్ కాన్ సంస్థ కార్యకలాపాలకు అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా చైర్మన్ యంగ్ ల్యూ కి హామీ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version