ఫిబ్రవరి 24 కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. · “హాత్ సే హాత్ జోడో” అనే “టాగ్ లైన్” తో ఫిబ్రవరి 24 ( శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందుగా జరుగుతున్న ప్లీనరీ సమావేశాలు చరిత్రలో ఓ మైలురాయి గా నిలిచిపోతాయని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ… మూడు రోజుల పాటు నవ రాయపూర్ లో జరిగే ప్లీనరీ సమావేశాల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 15 వేల మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఈ సమావేశాల్లో అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం పిసిసి ప్రతినిధులు 9,915 మంది కాగా, 1,338 మంది ఏఐసిసి ప్రతినిధులు, 487 కోఆప్టెడ్ సభ్యులు పాల్గొననున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇద్దరు పిసిసి ప్రతినిధులు. ఏపి నుంచి 350 ( 175×2= 350) పిసిసి ప్రతినిధులు, తెలంగాణ నుంచి (119×2= 238) పిసిసి ప్రతినిధులు హాజరుకానున్నారు. అలాగే, మూడు రోజుల “ప్లీనరీ సమావేశాల” అజెండా ను కూడా ఖరారు చేయనుంది కాంగ్రెస్ పార్టీ “స్టీరింగ్ కమిటీ”.