ఫిబ్రవరి 27 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

ఫిబ్రవరి 27 – మాఘమాసం – శనివారం

 

మేషరాశి:పేరు ప్రఖ్యాతులు పొందుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎంత కష్టమైన పనినైనా సాహసించి ధైర్యంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కార్యసాధన కలుగుతుంది. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతారు. నూతన వ్యక్తుల పరిచయం  ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. అనారోగ్యాన్ని తొలగించుకుని ఆరోగ్యంగా ఉంటారు. స్నేహితుల సహకారం అందుతుంది. మిత్ర లాభం కలుగుతుంది. కొత్త ఇంటిని కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

 

todays horoscope

వృషభ రాశి:అనవసర ఖర్చులు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా లేదు. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. రుణ బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు చేస్తారు. ధననష్టం కలుగుతుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఒత్తిడి ఎదురవుతుంది. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణాలు అనుకూలం, వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు దుర్గా దేవిని ఆరాధించండి. అవకాశం ఉంటే దగ్గర్లో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి.

 

మిధున రాశి:వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అందరితో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని అనారోగ్యాన్ని పోగొట్టుకుంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతలు పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. సోదరులంతా కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.

 

కర్కాటక రాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టపోతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణాలు అశ్రద్ధ వల్ల ప్రమాదాలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. విద్యార్థులం అనవసర విషయాలను పట్టించుకోని చదువు మీద అశ్రద్ధ చూపుతారు. సోదర సోదరీమణులకు వివాదాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి దర్శించుకుని ఆంజనేయస్వామికి సింధూరం వేయించండి.

 

సింహరాశి:పోటీపరీక్షల్లో విజయం పొందుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో అందరితో కలిసి మెలిసి సంతోషంగా, సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు వస్తాయి. సోదర సోదరీమణులకు కలిసిమెలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. లాభాలు వస్తాయి. సువర్ణ అభరణాలను కొనుగోలు చేస్తారు. గృహంలో ఏదో ఒక శుభకార్యాన్ని జరుపుతారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

కన్యారాశి:ధన నష్టం జరుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. రుణబాధలు తీరుతాయి. అవసరానికి చేతికి డబ్బులు ఉండవు. ధన నష్టం జరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులం చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. దంపతుల మధ్య మూడో వ్యక్తి జోక్యం వల్ల విభేదాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి.

 

తులారాశి:వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. సమయానికి చేతికి డబ్బు లు అందుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉన్నత విద్యలకు అర్హులవుతారు. వ్యాపారాలను విస్తరించి ఉంటారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉత్తమ ఉద్యోగులుగా మంచి పేరు పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:మొండి బకాయిలను వసూలు అవుతాయి !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. కుటుంబ సభ్యులతో అందరితో సఖ్యతగా, సంతోషంగా ఉంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. మొండి బకాయిలను వసూలు అవుతాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. సోదరులతో కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. గృహంలో శుభకార్యాన్ని నిర్వహిస్తారు. వ్యాపారాల్లో లాభాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది.

పరిహారాలుః ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి:కార్యసిద్ధి పొందుతారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. గతంలో పోగొట్టుకున్న గౌరవాన్ని డబ్బును తిరిగి పొందుతారు. సోదరులతో ఆనందంగా ఉంటారు. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల చే కీర్తింప బడతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. అనారోగ్యాలను తగ్గించుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు.

పరిహారాలుః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి !

ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామిని ఆరాధించండి.

 

కుంభరాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. అనారోగ్యాల బారి నుండి బయటపడి ఆరోగ్యంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు పదోన్నతులు పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు సమసిపోతాయి.

పరిహారాలుః ఈ రోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:ప్రయాణ లాభం కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. స్నేహితుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది. అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో అందరితో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. స్థిరాస్తులు కలసివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ప్రయాణ లాభం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version