క్రెడిట్‌ లిమిట్‌ పెంచుకుంటే లాభాలు.. మరి ఈ నష్టాల గురించి మీకు తెలుసా?

-

క్రెడిట్‌ కార్డు వాడుతున్న వారికి కార్డు లిమిట్‌ని పెంచుతామని సదరు బ్యాంకులు ఫోన్‌ చేసి చెబుతాయి. ఈ సందర్భాల్లో వీటి వల్ల మనకు లాభాలేంటి? నష్టాలేంటో ఓసారి చూద్దాం.

కార్డుల జారీ

 

క్రెడిట్‌ కార్డులు జారీ చేసినపుడు సంబంధిత బ్యాంకులు తక్కువ క్రెడిట్‌ లిమిట్‌తో ఇస్తారు. సకాలంలో చెల్లింపులు చేసిన తరువాత వారి ఆర్థిక స్థితిగతులను ట్రాన్సక్షన్ల ద్వారా పరిశీలించి.. ఆ తర్వాత క్రెటిట్‌ కార్డు లిమిట్‌ను పెంచుతాయి. కొన్నిసార్లు క్రెడిట్‌ లిమిట్‌ను పెంచడానికి క్రెడిట్‌ పరిమితి పెంచడానికి సంబంధిత సంస్థలు ముందుకొచ్చి.. ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందో? లేదా అప్పుల భారం పెరుగుతుందేమో అనే భయంతో చాలా మంది లిమిట్‌ పెంచుకోవడానికి సందిగ్దం చెందుతారు.

లాభాలు

  • క్రెడిట్‌ స్కోరు లెక్కించడానికి యూటిలైజేషన్‌ రేషియోను పరిగణిస్తారు.
  •  ఎక్కువ మొత్తాన్ని వాడితే సీయూఆర్‌ను దాటుతున్నట్లుగా పరిగణిస్తారు.
  •  సీయూఆర్‌ 30 శాతం దాటితే క్రెడిట్‌ లిమిట్‌ తగ్గిపోతుంది. అందుకే సీయూఆర్‌ను 30 శాతం తగ్గకుండా చేసుకోవాలి. దీనివల్ల క్రెడిట్‌స్కోరు మెరుగవుతుంది.
  • ఒకవేళ మీ క్రెడిట్‌ లిమిట్‌ లక్ష రూపాయలు ఉంటే ప్రతినెలా కార్డు ద్వారా రూ.50 వేలు ఖర్చు చేస్తున్నట్లయితే.. మీ సీయూఆర్‌ లిమిట్‌ 50 శాతం ఉన్నట్లు. మీ క్రెడిట్‌ లిమిట్‌ రూ.1.7 లక్షలకు పెంచితే సీయూఆర్‌ 29 శాతానికి తగ్గుతుంది.

నష్టాలు

  •  క్రెడిట్‌ లిమిట్‌ ఎక్కవ ఉంటే, ఖర్చు ఎక్కువ పెరుగుతుంది.
  • సకాలంలో బిల్లు చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
  •  మీ వద్ద కార్డులు ఎక్కవయ్యే కొద్ది, మీపై అధిక భారం పడుతుంది.
  •  ప్రతినెలా చెల్లింపులు సమయానికి చేయకపోతే, ఔట్‌స్టాండింగ్‌ డబ్బులు కట్టాల్సి ఉంటుంది.
  •  ఫలితంగా ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది.
  • ఏ నెల బిల్లును ఆ నెలలోనే చెల్లించాలి.
  • క్రెడిట్‌ కార్డు తస్కరణకు గురవుతే, ఆ సమయంలో మీ క్రెడిట్‌ లిమిట్‌ ఎక్కువగా ఉంటే మీకు నష్టం వాటిల్లే అవకాశం ఎక్కవే. ఈ సందర్భంలో మీ కార్డును వెంటనే బ్లాక్‌ చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version