ఫెంగల్ తుఫాన్ తీరం దాటడంతో ఏపీలోని తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం తలకోన జలపాతం వద్ద కూడా కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి తలకోన జలపాతానికి నీటి ప్రవాహం పెరిగింది.
దీంతో జలపాతం వద్ద వారం పాటు ఆంక్షలు విధించారు. జలపాతాన్ని వీక్షించేందుకు వచ్చే పర్యాటకులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఫారెస్ట్ అధికారులు ఆంక్షలు విధించినట్లు సమాచారం. కాగా, ఫెంగల్ తుఫాన్ కారణంగా తమిళనాడులోని కరైకాల్-మహాబలిపురం వద్ద తీరం దాటింది. దీంతో తమిళనాడు సహా ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో విద్యాసంస్థలకు ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.