టీవీ రిమోట్ కోసం గొడవ.. అత్త చేతి వేళ్ళు కొరికిన కోడలు

-

సాధారణంగా ఇంట్లో అత్తా, కోడళ్ల మధ్య గొడవలు సహజమే. కానీ అవి ఒక్కొక్క సారి హద్దు మీరుతుంటాయి. కొన్ని గొడవలు కుటుంబాన్ని చీల్చితే, మరికొన్ని ప్రాణాలను కూడా తీస్తాయి. పోలీస్ స్టేషన్ కూడా వెళ్తారు. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహారాష్ట్రలోని తానేలో విజయ కులకర్ణి (32) తన భర్త. అత్త వృషాలి తో కలిసి ఉంటుంది. అయితే విజయ, తన అత్త వృషాలి తో తరచూ గొడవ పడుతూ ఉండేది.

తాజాగా వృషాలి పూజ చేసుకుంటుండగా.. కోడలు విజయ టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి చూడ సాగింది. దీంతో అసహనానికి గురైన అత్త కోడలు చేతిలో ఉన్న రిమోట్ ని లాక్కొని సౌండ్ తగ్గిద్దామని ప్రయత్నించింది. దీంతోహానికి గురైన కోడలు అత్త చేతి వేళ్లను కొరికేసింది. దీంతో అత్త పోలీసులను ఆశ్రయించింది. కోడలు విజయపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version