టార్గెట్ బంగారం వ్యాపారులే…? ఈడీ ఫాస్ట్ గా అడుగులు

-

నోట్ల రద్దు సమయంలో అక్రమాలకు పాల్పడ్డ 25 మంది బంగారం వ్యాపారులపై వారి చార్టెడ్ అకౌంటెంట్ పై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. రూ.111 కోట్ల‌ రూపాయలతో బంగారాన్ని కొన్నట్లు నకిలీ ఇన్వాయిస్ సృష్టించి 28 కోట్ల రూపాయల ఆదాయాన్ని వ్యాపారులు పొందారని పేర్కొంది. మనీ ల్యాండరింగ్ జరిగిన రూ.130 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ… ముసొద్దిలాల్ జువలరీ పై హైదరాబాదు సిసిఎస్ లో మొదట కేసు నమోదు చేసింది.

గోల్డ్

నోట్ల రద్దు ప్రకటించిన రోజు రూ.500 రూ.1000 నోట్లతో కూడిన రూ.111 కోట్లను తమ బ్యాంక్ లో ముసొద్దిలాల్ జువెలర్స్ జమ చేసుకుంది. ఈ రూ.111 కోట్లను కస్టమర్లు బంగారం కోనుగోలు చేస్తే వచ్చినట్లుగా నకిలీ ఇన్ వాయిస్ క్రియేట్ చేసారు. ముసొద్దిలాల్ జువెలర్స్ కు చెందిన కైలాష్ చంద్ గుప్తాతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసారు. మిగతా బంగారం వ్యాపారులతో చేతులు కలిపి నల్లదనాన్ని మార్చుకున్నారని గుర్తించారు. చార్జిషీట్లో 41 మందిని అలాగే ముసొద్దిలాల్ ప్రమోటర్స్ ని నిందితులుగా చేర్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version