లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోన్న షూటింగులకి మళ్లీ బ్రేకులు పడ్డాయి. ఆర్నెళ్ల లాంగ్ బ్రేక్‌కి బ్రేక్ ఇచ్చి సెట్స్‌లో అడుగుపెట్టిన స్టార్స్‌ని మళ్లీ ఇంటికే పరిమితం చేస్తున్నాయి భారీ వర్షాలు. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో టాలీవుడ్ మళ్లీ షూటింగ్లకి బ్రేక్ ఇచ్చింది.అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచే షూటింగులు ఊపందుకున్నాయి. టాలీవుడ్ మోస్ట్ అవైటడ్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ కూడా లాంగ్ బ్రేక్ తర్వాత ఈ నెలల్లోనే సెట్స్‌కి వెళ్లింది. రవితేజ లాంటి మరికొంతమంది స్టార్లు కూడా ఈనెల్లోనే సెట్స్‌లో అడుగుపెట్టారు. అయితే క్రమంగా ఊపందుకుంటోన్న షూటింగులకి హైదరాబాద్‌లో పడుతోన్న భారీ వర్షాలతో బ్రేకులు పడుతున్నాయి.
హైదరాబాద్‌లో మంగళవారం నుంచి కురుస్తోన్న భారీ వర్షాలతో రోడ్లు కాలవల్లా మారిపోయాయి. చాలా ప్రాంతాలు చెరువులని తలపిస్తున్నాయి. పరిస్థితులు ఇంత ఘోరంగా ఉండడంతో షూటింగులకు బ్రేక్ ఇస్తున్నారు దర్శకనిర్మాతలు. భారీ వర్షాలతో చాలా ఖర్చుపెట్టి కట్టిన సెట్స్ కూడా దెబ్బతింటున్నాయని బాధపడుతున్నారు నిర్మాతలు. కరోనా జాగ్రత్తలు తీసుకుని మరీ షూటింగులు రీ-స్టార్ట్ చేసుకుంటే ఈ అకాల వర్షాలతో కొత్త సమస్య వచ్చిందని డిసప్పాయింట్ అవుతున్నారు.