తెలంగాణాలో సచివాలయం కూల్చివేతపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. సచివాలయాన్ని కూల్చడంపై విపక్షాలు ఇంకా ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సుప్రీం కోర్ట్ కి కూడా వెళ్ళగా దానిపై నేడు విచారణ జరిగింది. సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగగా…
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు రేవంత్‌రెడ్డి. సచివాలయ నిర్మాణంలో యథాతథస్థితిని పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. పర్యావరణ ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశించాలని రేవంత్ కోరారు. పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం… ఇప్పటికే సచివాలయం కూల్చివేత పూర్తయింది కదా అని అడిగారు సీజేఐ. ఇదే అంశంపై జీవన్‌రెడ్డి పిటిషన్ ను వేరే ధర్మాసనం కొట్టేసినట్లు రేవంత్ రెడ్డికి గుర్తు చేసారు. జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనానికి పిటిషన్‌ను బదిలీచేసారు.