జాతీయ అవార్డుల్లో తెలుగోడి సత్తా చాటిన చిత్రాలు..!!

-

తాజాగా ఈరోజు అనగా శుక్రవారం 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రస్తుతం జాతీయ అవార్డుల హవా కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా” కలర్ ఫోటో” ఎంపిక అవడం చాలా హర్షదాయకమని చెప్పవచ్చు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా మంచి కంటెంట్ ఉండడంతో జాతీయ అవార్డుకు ఎంపిక అయింది. కేవలం కలర్ ఫోటో సినిమా మాత్రమే కాకుండా ఉత్తమ కొరియోగ్రఫీ.. మేకప్ విభాగంలో నాట్యం సినిమాకు జాతీయ అవార్డు లభించింది. ఇక ఉత్తమ సంగీత చిత్రంగా అలవైకుంఠపురంలో చిత్రాలు అవార్డులు దక్కించుకుంటూ ఉండటంతో తెలుగోడి ప్రతిభకు నిదర్శనం అని చెప్పవచ్చు.

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల విషయానికి వస్తే .. సూరారై పొట్రు.. తెలుగులో ఆకాశమే నీ హద్దురా.. సినిమాకు గాను ఉత్తమ నటుడిగా సూర్యకు జాతీయ అవార్డు లభించింది. ఇక తానాజీ సినిమాలో నటనకు అజయ్ దేవగన్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఇకపోతే ఉత్తమ నటిగా సూరారై పొట్రు లో నటించిన అపర్ణ బాల మురళికి అవార్డు వరించింది. ఇకపోతే ఈ సంవత్సరం మొత్తం 30 భాషల్లో 35 ఫీచర్ ఫిలిమ్స్ ఎంట్రీ కి వచ్చాయి. అలాగే నాన్ ఫీచర్ ఫిలిం క్యాటగిరీలో 148 చిత్రాలు 20 భాషలలో స్క్రీనింగ్ కి వచ్చినట్లు జూరీ మెంబర్స్ ప్రకటించారు.

ఇకపోతే జాతీయ అవార్డులను ఈ ఏడాది ఐదు కేటగిరీలుగా విభజించారు .అందులో ఫీచర్ ఫిలిం 28 కేటగిరీలు, నాన్ ఫీచర్ ఫిలిమ్స్ 22 క్యాటగిరీలు, మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో పాటు బెస్ట్ రైటింగ్ సెక్షన్ క్యాటగిరిలో అవార్డులను ప్రకటించారు. ఇక ఉత్తమ సహాయ నటుడు బిజూ మేనన్ కు అయ్యప్పనమ్ కోషియుం చిత్రం నుంచి జాతీయ అవార్డు లభించింది. అలాగే సూరారై పొట్రు సుధా కొంగరకు కూడా ఉత్తమ చిత్రం కింద జాతీయ అవార్డు లభించింది. ఉత్తమ సహాయ నటిగా.. శివరంజనీయం ఇన్నుం సిలా పెంగలం చిత్రం నుంచి లక్ష్మీ ప్రియా చంద్రమౌళికి ఈ అవార్డు లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version