కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్థిక బిల్లు నేడు లోక్ సభ ఆమోదం పొందింది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెటరీ ఎక్సరసైజ్ పూర్తి అయింది. కాగ నేడు ఫైనాన్స్ బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీంతో లోక్ సభ సభ్యులు తమ ఓటును తెలిపి ఫైనాన్స్ బిల్లుకు ఆమోదం తెలిపారు. గతంలో ప్రవేశ పెట్టిన 39 అధికారిక సవరణలకు కూడా లోక్ సభ ఆమోదం తెలిపింది. అయితే విపక్షాలు సవరణలు కూడా పలు ప్రాతిపాదించింది.
ఈ సవరణలు లోక్ సభలో మూజువాణి ఓటుతో వీగిపోయాయి. కాగ ఫైనాన్స్ బిల్లుపై కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా వైరస్ తో పోరాడి.. ఆర్థికంగా వెనకబడ్డాయని అన్నారు. కరోనా మహమ్మారి తర్వాత దాదాపు 32 కు పైగా దేశాల్లో ఆయా ప్రభుత్వాలు ప్రజలపై భారీగా పన్నులను వేశాయని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మాత్రమే కొత్త పన్నులు వేయాలదని ప్రకటించారు. కాగ పన్నులు తక్కువగా ఉండాలన్నదే ప్రధాని మోడీ కళా అని అన్నారు. అలాగే కార్పొరేట్ పన్ను తగ్గించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రభుత్వానికి, కంపెనీలకు మేలు జరుగుతుందని అన్నారు.