అందరికీ ఉపయోగపడే ఫైనాన్షియల్ ప్లానింగ్ టిప్స్..!

-

ప్రతీ ఒక్కరు కూడా డబ్బులు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని టిప్స్ ని పాటిస్తే డబ్బులని బాగా మ్యానేజ్ చేసుకోచ్చు. జాగ్రత్తగా అనుసరిస్తేనే ఆర్ధికంగా ఇబ్బందులు రావు. లేదంటే ఇబ్బంది పడాలి.

money

బడ్జెట్‌ను రూపొందించండి:

నెలవారీ బడ్జెట్‌ను సెట్ చేయడం చాలా ముఖ్యం. మొదట మీ యొక్క జీతాన్ని తీసుకుని వాటిని ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించుకోవాలి. ప్రతి నెలకు ఒక నిర్దిష్ట బడ్జెట్‌ను మెయింటెన్ చేయడం ద్వారా ఆర్థిక లక్ష్యాలను చేరుకొచ్చు. అదే విధంగా మీ బడ్జెట్‌ను ట్రాక్ చేయడానికి ఉచిత యాప్‌లను మీరు వాడచ్చు.

తప్పనిసరి ఖర్చులు:

అద్దె, పన్ను, అప్పు, గృహ రుణం, క్రెడిట్ కార్డ్ బిల్లులు, బీమా, నెలవారీ ఖర్చులు మొదలైనవి తెలుసుకున్నాక మిగిలిన వాటి కోసం ఎంత ఖర్చు చెయ్యాలో చూడండి. అలానే యుటిలిటీలు, కిరాణా సామాగ్రి, పిల్లల చదువులు, గృహ రుణం మొదలైన అనేక బిల్లులు చెల్లించాలి కనుక జాగ్రత్తగా వాటిని కూడా చెల్లించండి. ఆ తరవాతే ఇతర ఖర్చులు పెట్టుకోండి.

పొదుపు:

నెలవారీ ఖర్చులను లెక్కించిన తర్వాత మీరు ఎంత డబ్బు ఆదా చేయగలరో లెక్కించండి. ఎంతో కొంత పొదుపు చెయ్యడం చాలా అవసరం.

ఆరోగ్య బీమా & అత్యవసర నిధి:

నగదు రహిత ఆరోగ్య బీమా కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యం బాగోకపోతే ఇబ్బందు రాకుండా ఉంటుంది. బీమాతో అనూహ్య పరిస్థితుల నుంచి అప్పులపాలు కాకుండా బయటపడవచ్చు. అదే విదంగా రెగ్యులర్ ఇన్కమ్ ఆగిపోవడం వంటి ఆర్థిక సమస్యలు ఉంటే కనీసం 3 నెలల అత్యవసర నిధి అవసరం.

Read more RELATED
Recommended to you

Exit mobile version