ప్రస్తుతం డిజిటల్ రంగం చాలా అభివృద్ధి చెందింది. చాలా మంది ప్రజలు స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. చిన్నారులు సైతం మొబైల్ ఫోన్లలోనే ఎక్కువ సేపు గడుపుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ ఉంటేనే సరిపోదు. కాంటాక్ట్స్ మెయిన్‌టెన్ చేయాలనుకుంటే.. సిమ్ కార్డు కూడా కావాలి. అందుకు ఫోన్ కొన్న వెంటనే యూజర్లు సిమ్ కార్డులు తీసుకుంటారు. గతంలో టెలికాం సంస్థలు యూజర్లను ఆకట్టుకునేందుకు ఉచిత బ్యాలెన్స్, వ్యాలిడిటీతో కూడిన సిమ్ కార్డులను తీసుకొచ్చేది. దీంతో వినియోగదారులు చాలా మంది బ్యాలెన్స్ వ్యాలిడిటి అయిపోయిన తర్వాత సిమ్స్ తీసి పడేసేవారు.
అవసరాలను బట్టి సిమ్ కార్డులు తీసుకోవడం, పడేయడం చేస్తుంటారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధనను తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరికి 9 సిమ్ కార్డులే మాత్రమని నిబంధన తీసుకొచ్చింది. అంతకంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందింది. మీ ఆధార్ కార్డు నంబర్‌పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు.
టెలికాం శాఖ ఇటీవల టూల్ అనలటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్ (TAFCOP)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. https://tafcop.dgtelecom.gov.in/index.php ఈ వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఆధార్ లింక్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే.. మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు.