విద్యుత్ ఉద్యోగులకు ఫైన్.. ట్రాఫిక్ సిగ్నల్స్‌కు కరెంట్ కట్

-

మెదక్ జిల్లాలో ఓ విచిత్రం జరిగింది. ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు విద్యుత్ ఉద్యోగులు త్రిఫుల్ రైడ్ చేస్తుండగా.. ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు. దీంతో మాకే ఫైన్ వేస్తారా? అని ఆగ్రహించిన విద్యుత్ సిబ్బంది ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్స్‌కు కరెంట్ కట్ చేశారు.

మెదక్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన వెలుగుచూసింది. బండిపై ట్రిపుల్ రైడ్ వెళ్తున్న ట్రాన్స్కో సిబ్బందికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేయగా.. మేము కరెంటోళ్లం మాకే ఫైన్ వేస్తారా? అంటూ పట్టణ కేంద్రంలోని అనేక ట్రాఫిక్ సిగ్నల్స్ కు కరెంటు కట్ చే శారు.దీనిపై ట్రాన్స్కో ఏఈని వివరణ కోరగా, ట్రాఫిక్ సిగ్నల్స్ కు మీటర్లు లేవని వెంటనే వాటిని అమర్చుకోవాలని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news