మాజీ సీఎం, పులివెందుల MLA, జగన్ సహా మరో 8 మంది YCP నేతలపై కేసు నమోదు అయింది. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. MLC ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డులో వైసీపీ నేతలు కార్యక్రమం నిర్వహించారు. జగన్తో పాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లి నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మాజీ సీఎం జగన్ కి భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైసీపీ ఆరోపిస్తున్నారు. తమ అధినేత జగన్కు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డు వద్ద జరిగిన ఘటనపై గవర్నర్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.