ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌పై కేసు నమోదైంది. ఆమె ఆధ్వర్యంలో నడిచే ఆల్ట్ బాలాజీ అనే ఓటీటీ యాప్‌లో పలు వెబ్ సిరీస్‌లలో జాతీయ చిహ్నం, హిందూ దేవుళ్లు, భారత ఆర్మీని అవమానించే విధంగా సన్నివేశాలు ఉన్నాయనే కారణంతో పలువురు మధ్యప్రదేశ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆల్ట్ బాలాజీ ఓటీటీ యాప్‌లో ప్రసారమవుతున్న ట్రిపుల్ ఎక్స్ అనే ఓ వెబ్ సిరీస్‌లో భారత ఆర్మీని అవమానించే విధంగా చూపించారంటూ ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నిజానికి ఆ యాప్‌లో ప్రసారమయ్యే దాదాపుగా అన్ని సిరీస్‌లు అడల్ట్ కంటెంట్‌కు చెందినవే. దేశంలో ప్రస్తుతం ఈ తరహా సిరీస్‌లను చాలా మంది నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే ఏక్తా కపూర్‌కు చెందిన బాలాజీ టెలిఫిలిమ్స్ ఏకంగా ఓ యాప్‌ను ఏర్పాటు చేసి.. అందులో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండే సిరీస్‌లను పెడుతోంది.
కాగా ఈ విషయంపై ఏక్తా కపూర్ ఇంకా స్పందించాల్సి ఉంది.