ఒకవైపు కరోనా కారణంగా దేశమంతా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఐదున్నర నెలలుగా కరోనాతో యుద్ధం జ్జరుగుతూనే ఉంది. కరోనా ఉధృతి రోజు రోజుకీ పెరుగుతూ ఉన్న తరుణంలో కరోనా రోగులని కాపాడాల్సిన ఆస్పత్రుల్లో మంటలు చెలరేగడం బాధాకరం. గుజరాత్ లోని వడోదరలో ఉన్న సర్ శివాజీ రావ్ హాస్పిటల్ లో మంటలు చెలరేగాయి. దాంతో కరోనా రోగులందరినీ సురక్షిత ప్రదేశాలకి తరలించారు.
ఐతే మంటలు ఎలా చెలరేగాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఘటనా స్థలంలో ఉన్నవారు చెప్పిన దాని ప్రకారం షాట్ సర్య్క్యూట్ అయ్యుంటుందని తెలుస్తుంది. ఎలక్ట్రిక్ వైర్ల నుండి సడెన్ గా వచ్చిన చప్పుడు, ఆ తర్వాత అక్కడ పొగ చేరడం, క్షణాల్లో మంటలు ఏర్పడటం జరిగిపోయిందని చెబుతున్నారు. ఒక్కసారిగా చెలరేగిన మంటలు అందరినీ షాక్ కి గురిచేసాయి. ప్రస్తుతానికి కరోనా రోగులందరినీ సురక్షిత ప్రాంతాలని తరలించారని సమాచారం.