మాదాపూర్ లోని ఓ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాదాపూర్ లోని రెస్టారెంట్ ఐదంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు.. మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నాయి.
రెస్టారెంట్ లో ఉన్న ఉద్యోగులందరినీ బయటకు రప్పిస్తున్నారు ఫైర్ అధికారులు. 5 అంతస్తుల బిల్డింగ్ లోని రెస్టారెంట్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి అంటున్నారు. సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి పక్కన ఉన్న కంపెనీల అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి.
పక్క కంపెనీలో ఉన్న ఐటీ ఉద్యోగులు కొందరికి గాయాలు అయ్యాయని చెబుతున్నారు. పేలుడు సంభవించిన రెస్టారెంట్ కి ఎదురుగా విరాట్ కోహ్లీ కి చెందిన రెస్టారెంట్ ఉందని చెబుతున్నారు. ఇప్పటి కీ కూడా మంటలు అదుపులోకి రాలేదు. బిల్డింగ్..పూర్తిగా తగలబడుతోంది.
మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వ బిల్డింగులో అగ్ని ప్రమాదం
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది pic.twitter.com/Ag9Kn8s78s
— Telugu Scribe (@TeluguScribe) December 21, 2024