ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న జీసీసీకి సంబంధించిన గన్నీ సంచుల నిల్వ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు గుర్తించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
దీంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సుమారు 90వేల వరకు గన్నీ సంచులు గోదాంలో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మొత్తం కాలిబూడిద అయినట్లు అధికారులు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.25 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. కాగా, అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.