బీఆర్ఎస్ పార్టీకి మరోసారి నిరాశ ఎదురైంది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి అధికార పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
గతంలో ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించగా.. వారికి నోటీసులుజారీ అయ్యాయి. తాజాగా కేటీఆర్, కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీం.. ఈనెల 18కి విచారణను మరోసారి వాయిదా వేసింది.నేడు తీర్పు వస్తుందని ఆశించిన బీఆర్ఎస్ పార్టీకి మరోసారి నిరాశ తప్పలేదు. కాగా, అనర్హత విషయంలో సుప్రీం తీర్పు తమకు ఫేవర్‌గా వస్తుందని గులాబీ పార్టీ నేతలు ఆశిస్తున్నారు.