చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారిని పరామర్శించారు కేటీఆర్. చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్ గారిని కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పరామర్శించారు.
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారిపై దాడి చేయడం అత్యంత దుర్మార్గం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యింది.. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా ఉపేక్షించకూడదని చెప్పారు.
దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ గారి కుటుంబ పరిస్థితే ఈ విధంగా ఉందంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అని వెల్లడించారు. ఈ దాడి చేసిన వారిని చట్టపరంగా, కఠినంగా శిక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్
చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్ గారిని ను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు pic.twitter.com/It66jsNj0J
— Sarita Avula (@SaritaAvula) February 10, 2025