త‌మిళ‌నాడులో అగ్నిప్ర‌మాదం..5గురు స‌జీవ‌ద‌హ‌నం..!

-

త‌మిళ‌నాడులో ఘోర అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. బాణ‌సంచా త‌యారీ కేంద్రంలో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌టంతో ఐదుగురు మృతి చెందారు. క‌ల్ల‌క‌కుర్చి జిల్లా శంక‌రావుపుంలోని ఓ బాణ‌సంచా హోల్ సేల్ దుకాణంలో ఈ భారీ అగ్రిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్య‌క్తులు స‌జీవ ద‌హ‌నం కాగా మ‌రో పదిమందికి పైగా వ్య‌క్తుల‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.

క్ష‌త‌గాత్రుల‌ను క‌ల్ల‌కుర్తి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దుకాణంలో అంటుకున్న మంటలు ప‌క్క‌న ఉన్న ఇత‌ర దుకాణాల‌కు కూడా వ్యాపించాయి. దీపావ‌ళి నేప‌థ్యంలో ఈ ప్రాంతంలో ఎక్కువ‌గా దుకాణాలు పెడ‌తారు. అంతే కాకుండా కొనుగోలు దారులు కూడా హోస్ సేల్ లో కొనేందుకు పెద్ద ఎత్తున వ‌స్తుంటారు. కొనుగోలు దారులు ఎవ‌రూ ఆ స‌మయంలో లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని స్థానికులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version