హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల్లోని అడవిని తెలంగాణ సర్కార్ రాత్రికి రాత్రే జేసీబీల సాయంతో తొలగించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. సుమారు 100 ఎకరాల్లోని అడవి చదును చేయడంతో అందులో జీవించే వన్యప్రాణులు అల్లాడాయి.ఈ క్రమంలోనే జింకలు ఎక్కడకు వెళ్లాలో తెలియక జనావాసాల్లోకి వస్తున్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక కుక్కల దాడుల్లో జింకలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి.
తాజాగా మరో జింక మృతి చెందింది. కుక్కలు తరుముతుంటే నీళ్లలో పడిపోయిన జింక బయటకు రాలేక ప్రాణాలు విడిచింది. ఘటనా స్థలానికి చేరుకొన్న ఫారెస్ట్, యూనివర్సిటీ సిబ్బంది.. ఫారెస్ట్ పోలీసులతో కలిసి నీళ్లలో ఉన్న జింకను బయటకు తీశారు. చెట్లను కొట్టివేయడంతో ఆవాసాలు లేక వన్యప్రాణులు బయటకు వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయి. కాగా, ఈ ఘటనలపై హెచ్ సీయూ విద్యార్థులు, జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.