ఉప్పల్‌లోని మెడికల్ షాపులో అగ్నిప్రమాదం.. రూ.10లక్షల ఆస్తినష్టం

-

హైదరాబాద్‌లోని ఉప్పల్ న్యూ శాంతి నగర్‌లో భారీ అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి దీపిక మెడికల్ షాప్‌లో కరెంట్ షాక్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనతో షాపులోని మెడిసిన్స్ మొత్తం పూర్తిగా దగ్దమైనట్లు తెలుస్తోంది. రాత్రి సమయం కావడంతో ప్రమాదాన్ని చాలా ఆలస్యంగా గుర్తించినట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. షాపు యాజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news