రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మిర్యాలగూడలోని ఓ టైర్ల షాపులో అగ్ని ప్రమాదం సంభవించగా.. దాదాపు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
షోరూంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో పది లక్షల విలువైన టైర్లు అగ్నికి ఆహుతయ్యాయి. కరెంట్ షాక్ కారణంగా షోరూంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.