సౌత్ కొరియా దేశంలో కార్చిచ్చు రగులుకున్నది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందాయి. అగ్ని కిలలు దావానంలా మారి మొత్తం దహించుకుపోతున్నది. దీంతో కార్చిచ్చు మంటల్లో ఇళ్లు, పాఠశాలలు, కర్మాగారాలు, పూజా స్థలాలు కాలి బూడిదవుతున్నాయి.
ఇప్పటివరకు ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా 27 వేలకు పైగా ప్రజలు నిరాశ్రయులైనట్లు సమాచారం. దాదాపు 50 వేల ఎకరాల అడవి ప్రాంతం మంటలకు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఆ మంటలను ఆర్పేందుకు అక్కడి ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. కార్చిచ్చు అడవి మొత్తాన్ని దహించుకువెళ్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రాణనష్టం, ఆస్తి నష్టం మరింత అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి.