పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం..

-


హైదరాబాద్ లోని పాతబస్తీలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాతబస్తీలోని ఇంజన్‌బౌలిలోని చెప్పుల గోదాంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. కొద్ది సెకన్ల కాలంలోనే మంటలు వ్యాప్తి చేందడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చునని భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news