చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం ?

-

కూటమి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఏలూరులో వైసిపి మూకల హత్యాయత్నం చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో వాగ్వాదం జరిగిందని చెబుతున్నారు. ఐరెన్ రాడ్ తో చింతమనేని సహా ఆయన డ్రైవర్, గన్ మెన్ పై వైసిపి అల్లరి మూకల దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే…నిన్ననే పెళ్లి వేడుక వద్ద కారు అడ్డుగా ఉందంటూ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవరుని బండ బూతులు తిట్టారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అది కూడా ఓ ప్రయివేట్ వ్యక్తుల కార్యక్రమంలో రెచ్చిపోయారు. అయితే ఆ సమయంలో వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి లేడని తెలుస్తోంది. ఒకవేళ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఉండి ఉంటె… పెద్ద గొడవ జరిగేది. అయితే.. దీనిపై చింతమనేని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలోనే.. చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగినట్లు ఓ వార్త వైరల్ అయింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news