జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు.కథువా జిల్లా సుఫైన్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గత ఐదు రోజులుగా ఆ ప్రాంతంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమాచారం.
నేటి ఉదయం సోదాలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు జవాన్ల మీదకు ఒక్కసారిగా కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే వీరమరణం పొందగా.. మరో ముగ్గురు పాకిస్థానీ అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు.డీఎస్పీ ధీరజ్ కచోట్‌తో పాటు మరో ఏడుగురు సిబ్బందికి గాయాలైనట్లుగా ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు.