అమెరికాలో మరోసారి కాల్పుల క‌ల‌కలం..!

-

అమెరికా ద‌క్షిణ కరోలినాలోని నైట్‌క్ల‌బ్‌లో కాల్పుల క‌ల‌కలం రేగింది. శనివారం నాడు ఒక నైట్‌ క్లబ్‌ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో నలుగురి పరిస్తితి విషమంగా ఉందని తెలుస్తుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇది జరిగినట్టుగా అధికారులు వెల్లడించారు. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకునేలోపే దుండ‌గులు ప‌రార‌య్యారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది.. లూయిస్, బోల్ట్‌ గా గుర్తించారు అధికారులు. అలాగే గాయ‌ప‌డిన వారు గ్రీన్‌ విల్లే మెమోరియల్‌ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నార‌ని పోలీసులు తెలిపారు. అయితే ఎవరు ఈ దారుణానికి ఒడిగట్టారు.. ఎందుకు చేశారనేది మాత్రం ఇంకా తెలియలేదు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version