దగ్గుబాటి హీరో నటిస్తున్న అహింస మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్.. ఇంత అరాచకమా..?

-

తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజకు విభిన్నమైన దర్శకుడుగా పేరు ఉందని చెప్పవచ్చు. ఇక ఎంతోమంది హీరోలను తన టాలెంట్ తో ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత డైరెక్టర్ కి దక్కుతుందని చెప్పవచ్చు. ఎక్కువగా తాను ఎంచుకున్న కథలని నమ్ముకుంటూ ఉంటారు డైరెక్టర్ తేజ. అయితే గడిచిన కొంతకాలంగా ఈ డైరెక్టర్ కి సక్సెస్ లేక సినిమాలు తగ్గించాలని చెప్పవచ్చు. త్వరలో దగ్గుబాటి ఇంటి నుండి యువ హీరో అభిరామ్ ను తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు. ఆ చిత్రమే అహింస.

సరికొత్త కాన్సెప్ట్ తో డైరెక్టర్ తేజ హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఒక విభిన్నమైన ప్రేమ కథ చిత్రంతో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమే అవుతుంది. అయితే కరోనా కారణం చేత పలు సినిమాలు షూటింగ్ వాయిదా పడడం జరిగింది. దీంతో ఎక్కడ సినిమాలు అక్కడే ఆగిపోయాయి. అలా ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి చిత్రబృందం గ్రూప్ ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది.

ఇక షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో చిత్రబృందం చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ ఏడాది చివరి కల్లా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుచేతన ఇప్పటినుంచి ఈ సినిమాకి వరుస అప్డేట్లు ఇస్తూ ఈ సినిమాకి మంచి హైప్ తీసుకువస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అభిరామ్ ఫుల్ ఫేసును చూపించకుండా కేవలం మాస్క్ తో కలిగిన ఫోటోలను, వీడియోలను విడుదల చేస్తూ ఉన్నారు. ఇక రీసెంట్ గా అహింస సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్ ను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ వీడియోతో ఈ సినిమా పైన మరింత క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు ఈ చిత్రంలో అభిరామ్ కి జోడిగా గీతిక తివారి నటిస్తున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version