జ‌న‌వ‌రి 10న పాక్షిక చంద్ర గ్రహణం..

-

ఈ ఏడాదిలో తొలి గ్రహణం జనవరి 10 ఏర్పడుతోంది. 2020లో మొత్తం ఆరు గ్రహణాలు ఏర్పడుతుండగా ఇందులో నాలుగు చంద్రగ్రహణాలు, రెండు సూర్యగ్రహణాలు ఉన్నాయి. గత నెల 26న సూర్యగ్రహణం సంభవించగా ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకించింది. కాగా, ఈ నెల 10న చంద్రగ్రహణం ఏర్పడనుంది. పాక్షిక గ్రహణమైన ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ఖండాల్లోనూ కనిపించనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

ఆ రోజున రాత్రి 10:30 నుంచి 11న తెల్లవారుజామున 2:30 గంటల వరకు గ్రహణం కొనసాగనుంది. ఈ ఏడాది మరో రెండు గ్రహణాలు సంభవించనున్నాయి. జూన్ 5న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుండగా, అదే నెల 21న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version