విమానం ఎక్కడం మొదటిసారా ? ఈ జాగ్రత్తలు తప్పనిసరి !

-

ఈ రోజుల్లో కూడా.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనుకునేవారు ఉన్నారు. బాగా చదువుకున్న వారైనా, చదువుకోని వారైనా మొదటిసారి ైఫ్లెట్ ఎక్కాలంటే లోపల తెలియని భయం ఏర్పడుతుంది. అయితే ైఫ్లెట్ జర్నీ ప్లాన్ చేసుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.

1. టిక్కెట్ తీసుకొని మెట్రోరైలులా వెళ్లి కూర్చుంటే సరిపోతుంది అనుకుంటే పొరపాటే.. కొన్ని కారణాల వల్ల ఎయిర్‌లైన్స్ మీ ప్రయాణాన్ని అడ్డుకోవచ్చు. టిక్కెట్ ఉన్న ప్రతీఒక్కరిలో సిబ్బంది లోపలికి అలో చేయదు. ప్రయాణికులను చెక్ చేసిన తర్వాత సిబ్బంది వారిని అడ్డుకోవడం సినిమాల్లో చూస్తూనే ఉంటాం.

2. ఎయిర్‌లైన్స్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉంటేనే ప్రయాణికుల్ని విమానం ఎక్కేందుకు అనుమతిస్తారు సిబ్బంది. లేకపోతే ప్రయాణానికి బ్రేక్ పడొచ్చు.

3. ఎయిర్‌పోర్టుకు వెళ్లేముందు మీరు ప్రయాణించే ఎయిర్‌లైన్స్ గైడ్‌లైన్స్ తెలుసుకోవడం మంచిది. ఇవన్నీ ఎందుకులే అని పట్టించుకోకుండా నేరుగా ఎయిర్‌పోర్టుకు వెళ్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

4. ప్రయాణికులు లోపలికి ప్రవేశించగానే వారు మద్యం మత్తులో లేదా డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు ైఫ్లెట్ అటెండర్ చెక్ చేస్తారు. వీరి వల్ల తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని భావిస్తే ైఫ్లెట్ ఎక్కకుండా అడ్డుకోవడం జరుగుతుంది.

5. విమానం ఎక్కడానికి ఎంత డబ్బయినా వెచ్చిస్తారు. పాదాల గురించి మాత్రం మర్చిపోతుంటారు. చెప్పులు, షూ ఎవరు చూస్తారులే అనుకుంటారు. పాదరక్షలు లేకుండా ైఫ్లెట్ ఎక్కాలనుకుంటే ఫస్ట్ ైఫ్లెట్ అటెండర్ అంగీకరించడు.

6. చెప్పులు మాత్రమే కాదు. వారు వేసుకునే బట్టలు అభ్యంతరకరంగా ఉన్నా కూడా విమానం ఎక్కేందుకు అనుమతి ఇవ్వరు. ఈ అంశంపై ఇప్పటికే చాలా సంఘటనలు జరిగాయి.

7. నిండు గర్భిణీ విమానం ఎక్కడానికి అర్హురాలు కాదు. ఈ నిబంధన వేర్వేరు ఎయిర్‌లైన్స్‌కు వేర్వేరుగా ఉంటాయి. ైఫ్లెట్ ఎక్కాలంటే డాక్టర్ సర్టిఫికేట్ తప్పనిసరి.

8. ఎయిర్‌లైన్స్ గైడ్‌లైన్స్ పట్టించుకోకుండా టేక్ ఆఫ్, ల్యాండింగ్ సమయంలో వాయిస్ కాల్స్ చేసినా, పొగతాగినా ప్రయాణానికి బ్రేక్ తప్పదు.

9. ఎయిర్‌పోర్ట్‌లో గేట్ ఏజెంట్ దగ్గర్నుంచి ైఫ్లెట్‌లో క్రూ మెంబర్స్, తోటి ప్రయాణాకుల వరకు ఎవరితో అయినా దాడికి పాల్పడితే విమానంలో ప్రయాణానికి అనుమతించరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version