Inspiration: కళ్లు లేకపోతేనేం.. కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది..

-

సర్వేద్రియానం నయనం ప్రధానం అన్నారు. ఒక్క రెండు నిమిషాలు కళ్లు మూసుకుంటే మనం ఎక్కడికీ కదలలేం.. ఏ పనీ చేయలేం.. అలాంటిది ఏకంగా చూపు లేకపోతే.. జీవితం దుర్భరం కదా. కానీ విజయాలకు వైకల్యాలు అడ్డురావని మరో అమ్మాయి నిరూపించింది. కళ్లు లేకపోయినా ఏకంగా ఐఏఎస్ అధికారిగా మారింది. పట్టుదలతో తన కల నెరవేర్చుకుంది.

ఆ అమ్మాయి పేరు ప్రాంజల్ పాటిల్. ఆమెది మహారాష్ట్రలోని ఉల్హాస్ నగర్. పాపం ప్రాంజల్ కు ఆరేళ్ల వయసులో కంటిచూపు పోయింది. అయినా ఆమె ఏనాడూ కలత చెందలేదు. పట్టుదలతో చదువులో రాణించింది. కళ్లు లేకపోయినా అపార ప్రతిభ ఆమె సొంతం. ఎప్పటికప్పుడు తన మేథస్సును పదును పెట్టుకుంటూ ముందుకు సాగింది.

సివిల్స్ ను టార్గెట్ గా చేసుకున్న ప్రాంజల్.. 2016 యూపీఎస్సీ పరీక్షల్లో తాను అనుకున్నది సాధించింది. ఈ పరీక్షల్లో 773వ ర్యాంకు సాధించింది. ఆ ర్యాంకుకు మంచి పోస్టింగ్ రాదు. అందుకే .. ఏమాత్రం వెనుకంజ వేయకుండా ముందుకు సాగింది. మరోసారి సివిల్స్ కు ప్రిపేరైంది. ఎట్టకేలకు ఆమె అనుకున్నది సాధించింది. 2017లో 124వ ర్యాంకు సాధించి ఐఏఎస్ సాధించి తన కలనెరవేర్చుకుంది.

ప్రాంజల్ పాటిల్ ప్రస్తుతం తిరువనంతపురం సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది. వైకల్యం విజయాలకు ఎప్పుడూ అడ్డుకాదంటోంది ప్రాంజల్.. నిరంతర ప్రయత్నాల ద్వారానే విజయాలు సాధ్యపడతాయని ఆమె చెబుతోంది. ఆమె ట్రైనింగ్ సమయంలో ఎర్నాకులం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా శిక్షణ తీసుకుంది. దేశంలోనే తొలి అంధురాలైన మహిళా ఐఏఎస్ గా ఆమె గుర్తింపు పొందింది.

Read more RELATED
Recommended to you

Latest news