బీరు తాగిన చేప‌.. వైర‌ల్ వీడియో..!

-

మ‌న చుట్టూ ఉన్న ప్ర‌పంచంలో నిత్యం అనేక సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. వాటిలో కొన్ని భ‌లే చిత్రంగా ఉంటాయి. కొన్ని షాక్‌ను క‌లిగిస్తాయి. అక్క‌డ కూడా స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. ఆ చేప ఏకంగా బీర్‌నే గ‌ట‌గ‌టా తాగేసింది. అవును.. ఇది నిజ‌మే.. ఏంటీ.. చేప బీరు తాగుతుందా ? అస‌లు అది జ‌రిగే ప‌నేనా ? అని మీరు షాక్ అయినా స‌రే.. ఈ సంఘ‌టన నిజంగానే జ‌రిగింది.

బ్రెజిల్‌లో ఓ వ్య‌క్తి స‌ముద్రంలో బోటుపై వెళ్తుండ‌గా.. మార్గ‌మ‌ధ్య‌లో ఆగాడు. ఇంతలో నీటి నుంచి పైకి వ‌చ్చిన ఓ చేప అత‌ని బోటుపైకి చేరుకుంది. అయితే అప్పుడు ఆ వ్య‌క్తి బీర్ తాగుతున్నాడు. చూద్దాం.. ఈ చేప బీర్ తాగుతుందా.. లేదా.. అని అత‌ను బీర్ టిన్‌ను ఆ చేప మూతికి అందించాడు. దీంతో ఆ చేప బీర్‌ను గ‌ట‌గ‌టా తాగేసింది. ఈ క్ర‌మంలో ఆ వ్య‌క్తి అవాక్కయ్యాడు. కాగా ఆ స‌మ‌యంలో తీసిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

స‌ద‌రు వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ అధికారి సుశాంత న‌ద త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. కాగా ఈ వీడియోకు ఇప్ప‌టికే 9వేల‌కు పైగా వ్యూస్‌, 800కు పైగా లైకులు వ‌చ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version