చేప కళ్లలో విటమిన్‌ బి 12 ఇంకా ఎన్నో పోషకాలు.. వేస్ట్‌ అనుకోని పారేస్తున్నారుగా.!

-

చేపలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చికెన్‌, మటన్‌ కంటే కూడా ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. చేపలను క్లీన్‌ చేసే ప్రాసెస్‌ మీరెప్పుడైనా చూశారా..? దాన్ని కట్‌ చేసి పైన పొట్టు తీసి, జన పక్కన పెట్టి, కళ్లు కూడా పీకేసి పారేస్తారు. ఇప్పుడు మనం ఆ కళ్ల గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే.. మీరు వేస్ట్‌ అనుకోని పారేసే కళ్లు చాలా బెస్ట్‌ అండీ.! చేప కళ్లు తినడం వల్ల మన ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయట. చేపలు తినడం వల్ల ఎర్ర రక్త కణాల పెరుగుదల వేగవంతం అవుతుంది. ఇది నాడీ వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. కొన్ని వ్యాధులకు వైద్యులు చేపలను తినమని సలహా ఇస్తారు. చేప కన్ను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం.

చేప కన్ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

పోషకాలు :

చేపలను తీసుకోవడం వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయో, దాని కంటిలో అనేక రకాల పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. చేపల కళ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేక వ్యాధుల నుండి మనలను రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్లు, ఖనిజాలు మంచి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

చర్మ ఆరోగ్యం :

చేపలో కొల్లాజెన్ ఉంటుంది. కొల్లాజెన్ ఒక రకమైన ప్రోటీన్. ఇది చర్మం, కీళ్ళు, జుట్టు, గోళ్ళకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కొల్లాజెన్ మన శరీరంలో ఉంటుంది. కానీ వయస్సుతో, తేమ స్థాయి తగ్గుతుంది. మనం చేపల కన్ను తినడం వల్ల కొల్లాజెన్ మన శరీరంలోకి కొంత వరకు చేరుతుంది.

జ్ఞాపకశక్తి మెరుగుదల :

ఈ రోజుల్లో ప్రజలు మెదడు ఆరోగ్యం గురించి మరచిపోతున్నారు. వివిధ రకాల పని, ఒత్తిడి కారణంగా, మెదడుపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. దీని వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. వృద్ధులు, పిల్లలతో సహా ప్రతి ఒక్కరిలో జ్ఞాపకశక్తిని పెంచడానికి ఫిష్ ఐని తీసుకోవాలి. చేపలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సహాయంతో బలహీనమైన జ్ఞాపకశక్తిని మెరుగుపరచవచ్చు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ల వినియోగం నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది మరియు మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

చేపలు తినే ప్రతి ఒక్కరూ చేప కళ్ళు తినలేరు. అలర్జీ వంటి సమస్య వారిని వేధిస్తుంది. చేపలు వండడానికి ముందు వాటి కళ్లను సరిగ్గా శుభ్రం చేయకపోతే ఇతర సమస్యలు కూడా వస్తాయి. అలర్జీ లేదా మరే ఇతర సమస్యలు లేని వారు మాత్రమే ఫిష్ ఐని తినాలి. బలవంతంగా తినవద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version